దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి 

దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి 

స్వగ్రామం నాగారంలో కుటుంభసభ్యులు, చిన్నారులతో కలిసి బాణాసంచ కాల్చిన మంత్రి 

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట : రాష్ట్ర మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. త‌న స్వగ్రామం తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం లోని తన నివాసంలో కుటుంభసభ్యులతో పాటు గ్రామానికీ చెందినచిన్నారులతో క‌లిసి బాణాసంచా కాల్చి 

దీపావ‌ళి సంబురాలు జరుపుకున్నారు.ఈసంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

చీకటిపై వెలుగు ,అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయాలకు దీపావళి పండగ ప్రతీకగా నిలుస్తుంది అన్నారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి డిసెంబర్ మూడవ తేదీన అసలైన దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.