బస్టాండు లేని మున్సిపల్ కేంద్రం

బస్టాండు లేని మున్సిపల్ కేంద్రం

ముద్ర, తిరుమలగిరి: వ్యాపార వాణిజ్యపరంగా దిన దినాబి వృద్ది చెందుతూ నాలుగు జిల్లాలకు కూడిలి అయిన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోనీ తెలంగాణ చౌరస్తాలో బస్టాండ్ లేకపోవడం మూలంగా ప్రజలు ప్రయాణికులు బస్సుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి మండుటెండలు నిలబడి ఎదురు చూడాల్సి వస్తుందని పలువురు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరిని మున్సిపాలిటీగా ప్రకటించినా నేటి వరకు కనీసం ప్రయాణికులు నిలవడానికి బస్సు సెల్టర్ నిర్మించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని పలువులు తెలిపారు జిల్లాలోనే ప్రధమ స్థానంలో ఉన్న తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు దూర ప్రాంతాల నుండి రైతులు అలాగే సూర్యాపేట జనగాం హైదరాబాద్ వరంగల్ .ఖమ్మం విజయవాడ లాంటి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు చెప్పారు.

ప్రతి సంవత్సరము తిరుమలగిరి మార్కెట్. సంత మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో లక్ష లాది రూపాయల ఆదాయం వస్తున్న కనీసం ప్రజలకు ప్రయాణికులకు కావలసిన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని పలువురు తెలిపారు జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బస్సు సెల్టర్లు బస్టాండ్ లు ఉన్న తిరుమలగిరి  తెలంగాణ చౌరస్తాలో బస్సు సెల్టర్ గాని బస్టాండ్ గాని నిర్మించడంలో పాలకులు వివక్షత ఎందుకు చూపిస్తున్నారని పలువు చెప్పారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ప్రయాణికుల ప్రజల సౌకర్యం కోసం బస్సు సెల్టర్ ను నిర్మించాలని కోరుతున్నారు