జాతరకు సిద్ధమైన గ్రామాలు

జాతరకు సిద్ధమైన గ్రామాలు

ఆలేరు (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక, రాజపేట మండలంలోని కుర్రారం, కల్లూరు, గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామాలలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నిర్వహించే మినీ జాతరకు సర్వంగా సిద్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు, మేడారం లో పగిడిద్దరాజు, జంపన్న, సమ్మక్క, సార్లమ్మ లను వనం నుండి ఆలయానికి తీసుకువచ్చే సలహాలోనే ఇక్కడ కూడా నిర్వహిస్తారు, మేడారం వెళ్లలేని వారు తమ పరిధిలోని గ్రామాలలో నిర్వహించే జాతర్లలో పాల్గొని మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ, ఈ జాతరకు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులు బందోబస్తు నిర్వహిస్తారు.