జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
  • జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తా
  • జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు

తుంగతుర్తి ముద్ర: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ అధ్యక్షతన జరిగిన టియుడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా జర్నలిస్టులు ఉంటారని సమాజంలోని మంచి చెడులను వార్తా రూపంలో ప్రచురించి ప్రపంచానికి తెలియపరుస్తారని అన్నారు.

సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా ప్రాధాన్యత కలిగిందని పాత్రికేయులు తాముతో కష్టానికి వచ్చి ఎండనగావాననక వార్త సేకరణ కోసం కష్టపడతారని అన్నారు ఒక్కోసారి కూర్చోవడానికి కూడా అవకాశం లేక ఎలాగోలా నిలబడి వార్తా సేకరణ చేస్తుంటారని ఇది పాత్రికేయుల వృత్తిలో అనునిత్యం జరుగుతున్నదని అన్నారు పాత్రికేయులు స్వలాభాపేక్ష లేకుండా సమస్యలను తమ పత్రికల ద్వారా ప్రపంచానికి చూపుతారని అన్నారు.

సమాజంలోని సమస్యలను వార్తలు ద్వారా ప్రచురించినప్పుడు అధికారులు పాలకులు స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని అన్నారు జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని అలాగే వారి ఆరోగ్యాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలని అందుకుగాను హెల్త్ కార్డు సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు జర్నలిస్టుల సమస్యలను తమ వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

  • జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా
  • టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ

రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులందరి సమస్యలను పరిష్కారానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని టి యు డబ్ల్యూజె ఐజేయు రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన విరహత్ అలీ అన్నారు మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లోజిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శంకరమంచి రవీందర్ శర్మ అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూజే సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారుటీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ ఆది నుండి జర్నలిస్టుల కోసం అనేక పోరాటాలు చేసిందని అందులో భాగంగానే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఒప్పించి అక్రిడేషన్ సౌకర్యం అలాగే ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేయించామని అన్నారు అలాగే తర్వాత ప్రభుత్వాలను ఉద్యమాల ద్వారా ఒప్పించి హెల్త్ కార్డు సౌకర్యం కూడా కల్పించామని అన్నారు యూనియన్ పరంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు అనునిత్యం ఆలోచిస్తామని పోరాటం చేస్తామని జర్నలిస్టులకు హెల్త్ కార్డు సౌకర్యం పునరుద్ధరించేలా ప్రస్తుత ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు.

అలాగే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరీ చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని అన్నారు గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు పట్టణ ప్రాంత జర్నలిస్టులకు ఉన్న సౌకర్యాలు అన్ని సమకూరేలా తాము కృషి చేస్తామని అన్నారు దశాబ్దాల కాలంగా యూనియన్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు ఎన్నో జర్నలిస్టు సంఘాలు మధ్యలో వచ్చి మధ్యలో పోయాయని కానీ టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రం నుండి దేశ రాజధాని వరకు ఉందని అన్నారు దేశం లోని అన్ని రాష్ట్రాల్లో బలమైన సభ్యత్వం కలిగిన యూనియన్ ఐ జి యు అని అన్నారు రానున్న కాలంలో జర్నలిస్టుల అపరిస్కృతి సమస్యలన్నింటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావును అలాగే రాష్ట్ర అధ్యక్షులు విరహతలిని తుంగతుర్తి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలోఐజ యు నాయకులు చలసాని శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బంటు కృష్ణ లతోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు