MLC Kavitha - ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత...

MLC Kavitha - ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత...

ముద్ర,తెలంగాణ బ్యూరో:- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ న్యాయస్థానం ఆమెకు బెయిల్ ను నిరాకరించడంతో వారు షాక్ కు గురయ్యారు.

కవితదే కీలక పాత్ర: సీబీఐ

లిక్కర్ స్కామ్‌ కేసులో కవితదే కీలక పాత్ర అని సీబీఐ కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. ఆమె బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇదిలా ఉంటే.. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్ లో ఉన్నారు కవిత.