చందుపట్ల గ్రామంలో చిరుత పులి సంచారం..

చందుపట్ల గ్రామంలో చిరుత పులి సంచారం..

ముద్ర, చివ్వెంల: చందుపట్ల గ్రామంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు శనివారం తెల్లవారుజామున చందుపట్ల గ్రామానికి చెందిన వ్యక్తి బోడ పట్ల ఎర్రయ్య తన వ్యవసాయ భూమి వద్ద చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానిక ఎంపీటీసీ కోడిబండకి విషయాన్ని చెప్పగా వెంటనే జిల్లా ఫారెస్ట్ అధికారులకి, చివ్వెంల పోలీస్ స్టేషన్లకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియచేశారు. అధికారులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని చిరుత పులి సంచరిస్తున్నట్లు ఆనవాలు, పాదాలను గుర్తించినారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రైతులకి హెచ్చరిక జారీ చేశారు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఘటన స్థలానికి బిఆర్ఎస్ మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు భూక్య నాగు నాయక్, భీమ్లల తండ సర్పంచి అమడా, చందుపట్ల సర్పంచి బోయిల కృష్ణ, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు, ఉన్నారు..

డీఎఫ్ వివరణ..
మురళి.. చిందుపట్ల గ్రామంలో  శనివారం పులి సంచరిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవని ఫారెస్ట్ అధికారి మురళి తెలిపారు. ఆనవాలు గుర్తించిన పాదాలు ల్యాబ్ పంపియగా అడవి పంది లేక తొడేలు అని  నిర్ధారణ అయిందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రం ఉన్న రైతులకు ఆందోళన చందాల్సిన అవసరం లేదన్నారు.