కదిలి ఆలయంలో మంత్రి సీతక్క పూజలు

కదిలి ఆలయంలో మంత్రి సీతక్క పూజలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని సుప్రసిద్ధ కదిలి శ్రీ మాతాన్న పూర్ణేశ్వరి పాపరేశ్వరుడిని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పాపహరేశ్వరుడికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు జరిపారు. పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాశస్త్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, ఎంపీ టికెట్ ఆశావహులు ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్ తదితరులున్నారు.