ఎస్ ఆర్ ఎస్పి  స్టేజ్ 1 ఆయకట్టు కు నీటి కొరత లేకుండా చూడాలి

ఎస్ ఆర్ ఎస్పి  స్టేజ్ 1 ఆయకట్టు కు నీటి కొరత లేకుండా చూడాలి
  • జగిత్యాల ఎమ్మెల్యే డా . సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎస్ ఆర్ ఎస్ పీ స్టేజ్ 1 ఆయకట్టు కు నీటి కొరత లేకుండా చూడాలని జగిత్యాల ఎమ్మెల్యే  డా . సంజయ్ కుమార్ అధికారులను కోరారు. మేడిపల్లి మండలం తొంబా రావుపేట డి 52  కెనాల్ ద్వారా రాయికల్ మండల గ్రామాలకు ఎస్ ఆర్ ఎస్ పీ నీటిని విడుదల చేయగా ఎమ్మెల్యే  రైతు నాయకులతో కెనాల్ పరిశీలించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారం తో  డి 52 కెనాల్ కు తుం ను 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

నేడు రాయికల్ లో 300 ఎకరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్తితి ఏర్పడిందన్నారు.  ఎస్ ఆర్ ఎస్పిలో 38 టీఎంసీ ల నీరు ఉందని, నీటిని వరద కాలువ ద్వారా మిడ్ మానేరు తో దిగువ ప్రాంతాలకు తరలించడం ఖండిస్తున్నామన్నారు.మేడి గడ్డ పిల్లర్ ను బాగు చేసి, ప్రాణ హిత ద్వారా దిగువ ప్రాంతాలకు నీరు తరలించాలని,జగిత్యాల, రాయికల్, బీర్ పూర్, సారంగా పూర్ , ధర్మపురి మండలాలకు నీటి కొరత రాకుండా చూడాలి అని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, పాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, గాన్నే రాజీరెడ్డి, కౌన్సిలర్ తురగ శ్రీదర్ రెడ్డి, ఎంపీపీ రాజ రత్నాకర్ రావు, నాయకులు భీమాయ్యా,సంగ రమేష్,ధర్మారెడ్డి,సంతోష్ రెడ్డి,భుం రెడ్డి ,రవీందర్, తదితరులు పాల్గొన్నారు.