ఎన్టీఆర్, రామ్ చరణ్  విశ్వరూపాన్ని ప్రదర్శించారు

ఎన్టీఆర్, రామ్ చరణ్  విశ్వరూపాన్ని ప్రదర్శించారు

ఢిల్లీ : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డులు రావడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. కళ కళ కోసం కాదు...ప్రజల కోసమన్నారు. 'ది ఎలిఫెంట్ విస్ఫరర్స్, ఆర్ఆర్ఆర్‌' కు ఆస్కార్ అవార్డులు రావడం మనకు గర్వకారణమన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా ఆర్ఆర్ఆర్ టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పోట్లగిత్తల్లా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారని నారాయణ పేర్కొన్నారు.