ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ- దుబ్బాక ఎంపీపీ  కొత్త పుష్పలత

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ- దుబ్బాక ఎంపీపీ  కొత్త పుష్పలత

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ రెండు నుంచి 22వ తేదీ వరకు మండల స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి దశాబ్ది ఉత్సవాలపై ఎంపీపీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారుల, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధుల సమన్వయంతో 20 రోజులపాటు చేసే కార్యక్రమాల అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఎంపీపీ కొత్త పుష్పలత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమము దేశంలో ఎక్కడ కూడా జరగలేదన్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవో భాస్కర శర్మ, ఏఎంసీ చైర్ పర్సన్ చింతల జ్యోతి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ బాల్రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, వైస్ ఎంపీపీ ఆస్క రవి, ఎంపీవో నరేందర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.