కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం...

కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం...
  • మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాహాసిల్ చౌరస్తాలో  మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ల  ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

పద్మశాలి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు.ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు.

నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలోనే ఎన్నో ఏళ్ల  నుండి ఎదురుచూస్తున్న 16 కులాల కార్పొరేషన్ల ఏర్పాటుతో వివిధ కులాల ఐక్యత పోరాటం ఫలించిందని కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో  పద్మశాలి  కులస్తులు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు బాసటగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లు కోసం అనేక ఆందోళన చేసిన స్పందించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు 3 నేలల్లో అమల్లోకి తెచ్చారన్నారు.

16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు. కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు.

ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, వేములవాడ దేవాలయం ట్రస్టు సభ్యులు అనుమల్ల చంద్రం, మానపురి మహేష్, సిరిపురం మహేందర్, సిరిపురం నిరంజన్, అలుస దయాకర్, అడువాల శ్రీనివాస్, గాజుల అరవింద్, పోతు సత్యనారాయణ, చక్రపాణి, మ్యాన రమేష్, కటుకం శేఖర్, ఎలిగేటి శంకర్ , అడెపు రాజేష్, నగేష్, ఎలుగందుల రవి, వాసం శంకర్, సింగం భాస్కర్, అడెపు సత్యం విక్రమ్, సంపత్,  తదితరులు పాల్గొన్నారు.