మొగిలిగిద్దలో పంచాయితీ వార్డ్ సభ్యుడి వినూత్న నిరసన 

మొగిలిగిద్దలో పంచాయితీ వార్డ్ సభ్యుడి వినూత్న నిరసన 
  • 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ ఆవేదన 
  •  వాటర్ ట్యాంక్ లోపలికి దిగి అధికారులకు మొరపెట్టుకున్న వైనం 

షాద్‌నగర్ ముద్ర:  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన ఓ యువకుడు ఏకంగా మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి దిగి తన నిరసనతో పాటు ఆవేదన వెళ్ళగక్కాడు. మొగిలిగిద్ద గ్రామానికి చెందిన తుపాకుల రవికుమార్ (మూడవ వార్డు సభ్యుడు) తన గోడు ఈ విదంగా వెలిబుచ్చుకున్నాడు. గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ఇంకా ఎన్ని రోజులు? ఈ ప్రయాస అంటూ అధికార యంత్రాంగాన్ని నిలదీశాడు. ఈ యువకుడు మూడో వార్డుకు గ్రామ సచివాల సభ్యుడిగా పని చేస్తుండటం గమనార్హం. తాను 15 రోజులుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వారు పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రయాస? అంటూ అధికార యంత్రంగ నిర్లక్ష్యాన్ని ఈ విధంగా నిరసనతో నిలదీశాడు. గత 15 రోజులుగా ఆయా వార్డులకు నీళ్లు సరఫరా కావడం లేదని, ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీళ్లను అందిస్తుంటే అధికారులు అమలు చేసే తీరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వెంటనే అధికారులు దీనికి సమాధానం చెప్పాలంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు