అంధత్వ నివారణ లయన్స్ ' లక్ష్యం.. మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ సునీల్ కుమార్

అంధత్వ నివారణ లయన్స్ ' లక్ష్యం.. మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ సునీల్ కుమార్

ముద్ర, వరంగల్: సమాజంలో అంధత్వ నివారనే లక్ష్యంగా లయన్స్ క్లబ్ పాటుపడుతోందని మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని కె ఎల్ ఎన్ కన్వెన్షన్ లో నేత్ర జ్యోతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి విజన్ సెంటర్ ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించడం అభినందనీయం అని, ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. త్వరలో వరంగల్లో క్లబ్ ఆధ్వర్యంలో సిటీ స్కాన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లయన్స్ జిల్లా గవర్నర్ కన్న పరుశురాములు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి  ప్రతినిధులు పాల్గొనడం సంతోష్ కారం అన్నారు. ఈ సందర్భంగా ఏకశిలా పబ్లిక్ స్కూల్ జనగామ ఆలేరు విద్యార్థులు సేకరించిన రూ 469,500 హైదరాబాద్ కు చెందిన వికలాంగుల సేవా సంస్థ ఇట్రోడ్ కు వితరణ చేశారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో విద్యాసాగర్ రెడ్డి, మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రఘు, కిషోర్ వెంకటనారాయణ లక్ష్మి శివప్రసాద్, గోపాలరావు, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.