తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

ముద్ర, మల్యాల:-మల్యాల మండలం తాటిపెల్లి గ్రామానికి చెందిన కస్తూరి విశ్వనాథ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం లాకర్ లోని 6 తులాల బంగారు ఆభరణాలు, రూ. 25 వేయిల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.