22 నుండి మే 6 వరకు మెదక్ లో స్పార్కిల్స్ క్యాంపు

22 నుండి మే 6 వరకు మెదక్ లో స్పార్కిల్స్ క్యాంపు

ముద్ర ప్రతినిధి, మెదక్: విద్యార్థులలో  మానసిక ఉల్లాసానికి, విజ్ఞానానికి ఈ నెల 22 నుండి మే 6 వరకు  మెదక్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలల్లో స్పార్కిల్స్ క్యాంపు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. గురువారం తన ఛాంబర్ లో స్పార్కిల్స్ క్యాంపుకు సంబందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22 నుండి పక్షం రోజుల పాటు  వెస్ట్రన్ డాన్స్, వేదిక్ మాథ్స్, మ్యూజిక్, లైఫ్ స్కిల్స్  స్పార్కిల్స్ పై  క్యాంపు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.  ఇందులో సాంఘీక, గిరిజన సంక్షేమం,  ఏకలవ్య పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు  వరలక్ష్మి,  సీనియర్ వైస్ ప్రిన్సిపల్ ఉమారాణి  తదిఆరులు పాల్గొన్నారు.