పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక తర్ఫీదు

పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక తర్ఫీదు
  •  పారదర్శకంగా కార్యాచరణ.
  • రెండో రోజు  శిక్షణకు 2769 మంది హాజరు.
  •  జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు రెండురోజుల శిక్షణా కార్యక్రమం ఎంతో దోహద పడుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల  అధికారి  అధికారి ఎస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.  శనివారం జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో పి.ఓ, ఏ.పి.ఓ లకు ఎన్నికల రోజున నిర్వహించే విధులు,విధానాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో   సూర్యాపేట, కోదాడ హుజూర్ నగర్, అలాగే తుంగతుర్తి కేంద్రాలలో సంబంధిత ఆర్.ఓ ల సమక్షంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనైనదని కలెక్టర్ తెలిపారు.  మొత్తం నాలుగు నియోజక వర్గాలలో చేపట్టిన శిక్షణకు 2769 మంది పి.ఓలు, ఏ.పి.ఓ లు హాజరు కాగా 171 మంది గైరాజరు అయినట్లు తెలిపారు. అట్టి శిక్షణా కు గైర్హాజరు అయిన వారికి ఆర్.పి. యాక్ట్ 26 ప్రకారం షో కాజ్ నోటీసులు జారీ చేస్తామని, మరోమారు ఆయా నియోజక వర్గాల్లో సోమవారం శిక్షణ ఉంటుందని తప్పక హాజరు కావాలని లేని యెడల  నిబంధనలకు లోబడి సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

రెండు రోజుల శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొందిన పి.ఓ, ఏ.పి.ఓ లు పోలింగ్ బూత్ లలో సమర్థవంతంగా  ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని తెలిపారు.     ముఖ్యమైన నిబంధనల పట్ల అవగాహన ఉంటే పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా జరుగుతుందని ఆదిశగా తర్ఫీదు అందించామని పేర్కొన్నారు. పోలింగ్ అధికారులకు ముఖ్యంగా ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ, ఈవిఎం యంత్రాల పని తీరు, బాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ,వివి ప్యాట్ల కనెక్షన్లు, వాటి  పని తీరు, మరమ్మత్తు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు.

     ఈ శిక్షణా కార్యక్రమంలో  తుంగతుర్తి ఆర్.ఓ ,అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, సూర్యాపేట ఆర్.డి.ఓ వీర బ్రహ్మ చారి, కోదాడ ఆర్.డి.ఓ సూర్యనారాయణ, హుజూర్ నగర్ ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,  శిక్షనలో పాల్గొన్నారని కలేక్టర్ ఒక ప్రకటనలో తేలిపారు.