స్వామి యాదవ్ కుటుంబానికి అండగా ఉంటాం : పుట్ట వీరేష్ యాదవ్

స్వామి యాదవ్ కుటుంబానికి అండగా ఉంటాం : పుట్ట వీరేష్ యాదవ్

20 వేల  రూపాయల ఆర్థిక సహాయం అందజేత    

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన కొసన స్వామి యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని శ్రీ కృష్ణ యాదవ్ సంఘం జిల్లా  అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్ అన్నారు. ఇటీవల అనారోగ్యం తో స్వామి మృతి చెందగా శుక్రవారం శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా నాయకులు కుటుంబ సభ్యులను కలిసి  పరామర్శించి సంఘం తరుపున ఇరవై వేల రూపాయలు అర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా  వీరేష్ యాదవ్ మాట్లాడుతూ స్వామి మరణంతో ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. స్వామి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా శ్రీ కృష్ణ యాదవ సంఘం వారికి  ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నరాల నరాల నిర్మల వెంకట్ స్వామి యాదవ్ , జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్, మేకల బాలు యాదవ్, భువనగిరి మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్, అలేర్ మండల అధ్యక్షులు రాజబోయిన కొండల్ యాదవ్, తుర్కపల్లి మండల అధ్యక్షులు సీతారామరాజు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బాత్క అశోక్ యాదవ్, యూత్ మండల అధ్యక్షులు రాసాల లింగ స్వామి యాదవ్, యూత్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం శరత్ యాదవ్, మండల సంయుక్త కార్యదర్శి బినబోయిన నరేష్ యాదవ్, రాజశేఖర్ యాదవ్, మాకోల్ శివ యాదవ్, బీబీనగర్ యూత్ మండల అధ్యక్షులు కొసన సాయి యాదవ్, శ్రీరాం శ్రీనివాస్ యాదవ్, గోగు శ్రీహరి యాదవ్, గోగు సాయి రామ్ యాదవ్ పాల్గొన్నారు.