శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక కర్షకవర్గ పోరాటాలు వర్గ పోరాటాలు నిర్మిద్దాం మేడే వర్థిల్లాలి

శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక కర్షకవర్గ పోరాటాలు వర్గ పోరాటాలు నిర్మిద్దాం మేడే వర్థిల్లాలి

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : జిల్లా  సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో  మేడే సందర్భంగా  జమ్మిచేడు  బస్టాండ్ సెంటర్ దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంలో  ఐ యఫ్ టి యు జిల్లా  ఉపాధ్యక్షుడు కోళ్ల  ఆంజనేయులు   ఆవిష్కరించారు .ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి 1886 లో చికాగో నగరంలో కార్మికులు పోరాడి8 పనిగంటలు కార్మిక హక్కులు సాధించుకున్న రోజుగా శ్రామికులు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. శ్రమ దోపిడి అదనపు విలువ యజమానులు కార్మికులు ఎక్కువ గంటలు పని చేయించి బానిసలుగా చేసుకుని సంపద అనుభవిస్తూ వచ్చారు. దోపిడికి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు నిర్వహించి కార్మికులు హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు నేడు  కేంద్ర ప్రభుత్వం 44లేబర్ కోడ్ ను ఎత్తివేస్తూ కార్మికులను ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ శ్రమదో పడి గురి చేస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందన్నారు. కార్మికుల ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు గ్రామపంచాయతీ భవన నిర్మాణ ఇతర రంగ కార్మికులు మే డే ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో   నాయకులు రామకృష్ణ పరశురాముడు రాజు రమేష్ దవులు ప్రేమ రాజు శ్రీకాంత్ పరశురామ్ బిసన్న సుధాకర్ ఇమ్మానియేల్  కార్మికులు ప్రజలు పాల్గొన్నారు..