విద్యుత్​ బాదుడుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

విద్యుత్​ బాదుడుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

విద్యుత్​ బాదుడుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు జరుగుతున్నాయి. పెంచిన విద్యుత్​ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేస్తున్నారు.   బాపట్లలోని వేమూరు సబ్​ స్టేషన్​ ఎదుట నక్కా ఆనంద్​ బాబు ధర్నా. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ విద్యత్​ సబ్​ స్టేషన్​ ఎదుట నరసరావుపేట టీడీపీ ఇన్​చార్జి అరవింద్​ బాబు ఆధ్వర్యంలో ధర్నా.  పెదకూరపాడు సబ్​స్టేషన్​ ఎదుట కొమ్మాలపాటి శ్రీధర్​ ధర్నా. గుంటూరులోని పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర నిరసన. గుజ్జనగుండ్లలో టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ధర్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల నినాదాలు చేస్తున్నారు.