తెలంగాణలో రైతే రాజు

తెలంగాణలో రైతే రాజు
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  • జిల్లాలో ఉత్సాహంగా రైతు దినోత్సవం
  • ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు
  • పల్లెల్లో పండుగ వాతావరణం

ముద్ర ప్రతినిధి, జనగామ: రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ ఎంతో కృషి చేస్తోందని, దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం రైతు దినోత్సవానాన్ని నిర్వహించారు. జనగామ మండలం వడ్లకొండ, బచ్చన్నపేట మండలం కొడ్వటూర్ రైతు వేదికల్లో జరిగిన కార్యక్రమాల్లో రూరల్ డెవలప్‌మెంట్‌, ఉద్యానవన శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు, కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాంతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.  రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా,ఉచిత కరెంటు, గిట్టుబాటు ధర, వ్యవసాయ రంగ యంత్రాలపై సబ్సిడీ రుణాలు, పంటలపై వివిధ రకాల రాయితీలు తదితర పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. సాగులో ఉన్న ప్రతి గుంట భూమికి ప్రాజెక్టులు, కెనాళ్లు, చెరువులు, కుంటల ద్వారా సాగు నీరు అందిస్తున్నట్లు చెప్పారు.

కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న రైతులు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపాలని సూచించారు. ఆఫీసర్లు వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాంచారు. అంతకుముందు రైతులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, రైతు బంధు అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి ఎడ్ల బండ్ల, ట్రాక్టర్లు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో ఊరేగింపుగా రైతు వేదికల వద్దకు తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఏవో వినోద్ కుమార్, ఎంపీపీ కళింగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌‌రెడ్డి, రైతు కోఆర్డినేటర్ ప్రమోద్, వడ్లకొండ, కొడ్వటూరు సర్పంచ్‌లు శారద, జి.సతీశ్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఎంపీపీ నాగజ్యోతి, ఉద్యానవన శాఖ అధికారిని కేఆర్ లత, డీఐఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఊరంతా పండుగ వాతావరణం...
జనగామ జిల్లా పాలకుర్తి నియోజవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో జరిగిన రైతు దినోత్సవంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఎర్రబెల్లి ఉషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ రైతు నీరటి చిన్న ఉప్పలయ్య సన్మానించారు. కోలుకొండ, నిర్మాల, సింగరాజుపల్లి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లను సుందరంగా ముస్తాబు చేసి గ్రామ ప్రధాన విధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదికల్లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి, దేవరుప్పుల వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి, నీర్మాల సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ మేడ కళ్యాణి వెంకటేశ్‌, సింగరాజుపల్లి సర్పంచ్ గోపాల్ దాస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. 

రైతు బాంధవుడు కేసీఆర్‌‌ : గుడి వంశీధర్‌‌రెడ్డి
లింగాలఘణపురం, వనపర్తి , బండ్లగుడెం క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవంలో వేడుకల్లో జడ్పీటీసీ గుడి వంశీధర్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు బాంధవుడు మన కేసీఆర్‌‌ అంటూ రాష్ట్ర ప్రభుత్వ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో డీసీపీ సీతారాం, ఏసీపీ రఘుచందర్, ఎస్సై ప్రవీణ్‌తో పాటు ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.