గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యం...

గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యం...

మెట్‌పల్లి ముద్ర: పట్టణ శివారులోని హెచ్ పీ గ్యాస్ గోదాం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు.పట్టణ శివారులో అటువైపుగా వెళుతున్న వ్యక్తుల కు దుర్వాసన రావడంతో అటు ఇటు చూడగా ఇటుక బట్టిల వద్ద కుళ్లిపోయిన స్థితిలో పడివున్న వ్యక్తి మృత దేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.వ్యక్తి మరణించి దాదాపుగా మూడు రోజులు అవుతున్నట్లు తెలుస్తోంది.కాగా కుళ్ళిన స్థితిలో మృత దేహం పడి ఉండడంతో మళ్ళీ హత్య జరిగి ఉండవచ్చని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.