ఎదిరించేవారు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం - వట్టే జానయ్య యాదవ్ 

ఎదిరించేవారు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం - వట్టే జానయ్య యాదవ్ 

పలు తండాల్లో జోరుగా సాగిన ప్రచారం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గం  చివ్వెంల మండలం మంగలి తండా, వాల్య తండా, జగన్ తండా గ్రామాలలో మంగళవారం బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
 ప్రతి తండాలో జానయ్య యాదవ్ కు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలలో సరైన అభ్యర్థినీ ఎన్నుకొని ఓటు వేయాలని కోరారు.
ఓట్లు వేసిన నాయకులను ఎదిరించకపోతే బెదిరించి రాజ్యపాలన చేస్తారని అన్నారు.
ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు బనయించారని ఆవేదన వ్యక్తం చేశారు
గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి చెoదని వారిని కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు గెలిపించారని ఈసారి స్థానికుడైన జానయ్యకు ఓటేసి గెలిపించుకోవాలని కోరారు.
సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అనంతరం 200 మంది బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్  సమక్షంలో బిఎస్పి పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ షేక్ హుస్సేన్ , మధు నవీన్ శివ కిరణ్ ఉపేందర్ శ్రీకాంత్ వరుణ్ నగేష్ సునీల్ నాగేశ్వర్ జగన్ వీరు దసరు మహేందర్ వెంకమ్మ శారద చావలి బుజ్జి కాంతమ్మ సాలమ్మ మంగమ్మ లక్ష్మి తదితరులు పార్టీలో చేరారు.
ప్రచార కార్యక్రమంలో ఐలాపురం సర్పంచ్ బోడబట్ల సునీత శ్రీను, మాజీ ఎంపిటిసి గడ్డం సైదులు, సుంకర బోయిన రాజు, దేశబోయిన సురేష్, చింతకాయల జానయ్య ధరావత్ శంకర్, భానోతు లింగ, శివ, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీలో అనాజీపురం నుంచి ముదిరాజ్ ల చేరిక


సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్ పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు 100 మంది టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి మంగళవారం బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో బిఎస్పి పార్టీలో చేరారు. 
పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. బి ఎస్ పి పార్టీలో చేరిన వారి లో నూకల రవి, భైరవబోయిన నవీన్, నూకల సైదులు, నూకల అంజయ్య, అలవాల నరేష్, నూకల వీరస్వామి, దాసరి లింగయ్య, కాశబోయిన లచ్చయ్య, కాశ బోయిన మట్టయ్య, దాసరి మత్తయ్య కాశ బోయిన ఏసు, నూకల లింగయ్య సైదులు కాశ బోయిన వెంకన్న నూకల కాశీ అలువాల నాగరాజు అలువాల సైదులు ఆశ బోయిన జోసెఫ్ ఆశ పోయిన రాజమ్మ దాసరి యశోద నూకల శైలజ నూకల జయమ్మ నూకల నాగమ్మ నూకల వెంకమ్మ నూకల సుభద్ర తదితరులు పార్టీలో
 చేరారు
ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు లక్కపాక సైదులు, నకరికంటి వెంకన్న, పరుపుల అనురాగ్, లక్కపాక ఠాగూర్ శశి తదితరులు పాల్గొన్నారు.

19 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నుంచి బిఎస్పి లో చేరికలు 

సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణం19 వ వార్డు భగత్ సింగ్ నగర్  చెందిన నాంపెల్లి కృష్ణ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ నాయకత్వం లో సూర్యాపేట పట్టణ ఇంచార్జ్ గండూరి కృపాకర్  సమక్షంలో పార్టీ లో చేరారు,