వీరభద్ర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్  ఐలయ్య 

వీరభద్ర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్  ఐలయ్య 

ముద్ర ప్రతినిధి భువనగిరి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన పంచాంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. 

ఘనంగా ప్రభుత్వ విప్ బీర్ల వారసుని జన్మదిన వేడుకలు
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనితల కుమారుడు బీర్ల శివమణి జన్మదిన వేడుకలను మంగళవారం యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని బీర్ల నివాసంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేకు కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు.