మోదీజీ తెలంగాణ పై ఎందుకంత వివక్షత- బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నించిన భట్టి

మోదీజీ తెలంగాణ పై ఎందుకంత వివక్షత-  బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నించిన భట్టి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి తెలంగాణ పై ఎందుకంత వివక్షతో వెల్లడించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ వస్తున్న సందర్భంగా శుక్రవారం ప్రధానికి పలు ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ ను భట్టి మీడియా కు విడుదల చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రత్యేక హక్కులను అమలు చేయకుండా కాలలార్చుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ కు ప్రాజెక్టు లు, కేటాయించిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విభన చట్టంలోని ఎన్ని అంశాలను అమలు చేశారో శ్వేతపత్రం  చేసే దమ్ము, ధైర్యం కేంద్రానికి ఉందా అని  ప్రశ్నించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు హామీ కూడా బుట్టదాఖలైందని విమర్శించారు. బయ్యారం లో ఉక్కు కర్మాగారం ఎప్పుడు ప్రారంభిస్తారో బహిరంగంగా వెల్లడించాలని సవాల్ విసిరారు. తెలంగాణ లో వెనుకబడిన జిల్లాలకు మంజూరు చేయాల్సిన నిధులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలతీసారు. నూతన ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు, ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అంతరార్థం తెలియడం లేదని ఆయన అన్నారు. కేసీఆర్ పలు కేసుల్లో జైలుకు వెళ్తాడని కేంద్ర, రాష్ట్ర పార్టీ పెద్దలు చెప్పడం తప్ప అసలు అరెస్టులు ఎందుకు జరగడం లేదని ఆయన సంశయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రి గా ఉన్న హయాంలో సహారా ఇండియాలో ఈ ఎస్ ఐ కుంభకోణం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కొత్త విద్యా సంస్థలు, పారిశ్రామిక రాయితీలు ఇవ్వకుండా తెలంగాణ ను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఇతర అంశాలపై భట్టి ప్రధాని ని లేఖలో నిలతీసారు.