మెదక్ కలెక్టరేట్ ముందు యువజన కాంగ్రెస్ ధర్నా

మెదక్ కలెక్టరేట్ ముందు యువజన కాంగ్రెస్ ధర్నా

ముద్ర ప్రతినిధి మెదక్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  టీ.ఎస్.పి.ఎస్.సీ ప్రశ్న పత్రం లీకేజీ చేసి 30 లక్షలు మంది నిరుద్యోగుల జీవితాలను రోడ్డు మీదకు తెచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బాద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీ.ఎస్.పి.ఎస్.సీ చైర్మెన్, లీకేజీ చేసిన వ్యక్తినీ వెంటెనే సస్పెండ్ చెయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తిరిగి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. స్టడీ మెటీరియల్ తో పాటు ఉచిత భోజనము వసతి కల్పించాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎఓకు వినతిపత్రం అందజేశారు.