తొక్కిసలాటలో కిందపడిపోయిన వైఎస్​షర్మిల 

తొక్కిసలాటలో కిందపడిపోయిన వైఎస్​షర్మిల 

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల  ఇంటి వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. మంగళవారం  ఛలో ఉస్మానియా ఆస్పత్రి కి షర్మిల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం నగరంలోని లోటస్‌పాండ్‌లోని ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుతగిలారు. దీంతో పోలీసులతో వైఎస్సార్టీపీ చీఫ్ వాగ్వాదానికి దిగారు. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో షర్మిల కిందపడిపోయారు.  ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత అని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్టీపీని, వైఎస్సార్‌ బిడ్డను చూసి భయపడుతున్నారని అన్నారు. తాను చేస్తున్న పాదయాత్రను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అడిగి ప్రతీ పరిష్మన్‌ను ఆపుతూనే ఉన్నారని షర్మిల అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవన్నారు. రూ.200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం 9 ఏళ్ల క్రితం చెప్పారని గుర్తుచేశారు. ప్రజలకు వైద్యం అందడం లేదని తనకు పిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతిపక్షాలను ఆపడానికి శాంతి భద్రతల సమస్య అంటారా అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.