కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రాజపూర్ మండల పరిధిలో (26) మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి / శాడిముబారక్ చెక్కుల పంపిణీ.

మహబూబ్ నగర్ ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రాజపూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించి, కంటి చికిత్స అనంతరం పలువురు మహిళలకు కళ్లదలను ఎమ్మెల్యే గారు అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలు అందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవలని అన్నారు. ఇందుకు కోసం ప్రభుత్వ సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. 'కంటి వెలుగు' రెండో విడత కింద 100 రోజుల పాటు ఈ శిబిరాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని అన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, ఔషధాలు పంపిణీ చేస్తారని, అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా చేయిస్తారని అన్నారు. అనంతరం రాజపూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన (26) మంది లబ్ధిదారులకు సుమారు 26 లక్షల విలువైన కళ్యాణాలక్ష్మి/శాడిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు.