పెద్దపెల్లి జిల్లాలో విషాదం

పెద్దపెల్లి జిల్లాలో విషాదం

 తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో గురువారం ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు యాకూబ్, రాజులు, రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ దిగి రైల్వే ట్రాక్ దాటుతుండగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు.