కార్వాన్ నియోజకవర్గంలో 297 కోట్లతో డ్రైనేజీ పనులు

కార్వాన్ నియోజకవర్గంలో 297 కోట్లతో డ్రైనేజీ పనులు
  • నేతాజీ నగర్ లో కొత్త లైన్ల ఏర్పాటుకు హామీ

హైదరాబాద్: కార్వాన్ నియోజకవర్గంలో 297 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త డ్రైనేజీ లైన్ల నిర్మాణం, మరమ్మతు పనులు చేపడుతున్నట్లు శాసనసభ్యుడు కౌసర్ మోహియుద్దీన్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఒవైసీల సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారంనాడు ఆయన నేతాజీ నగర్ కాలనీలో పర్యటించి సమస్యల గురించి తెలుసుకున్నారు. కాలనీ అసోసియేషన్ నాయకులతోసమావేశమై కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి జి అప్పారావు,  మరో ఉపాధ్యక్షుడు మహ్మద్ సర్వర్, ట్రెజరర్ కే. ప్రభాకర్, కార్యదర్శులు కే. శ్రీధర్,  కృష్ణదాస్,  కార్యవర్గ సభ్యులు వై. నరేందర్ రెడ్డి, అబ్దుల్ మాలిక్, మహ్మద్ షాఖిర్, మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ లైన్ సరిపోక తరచూ చోక్ కావడంతో మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తున్నదని, పైపుల పరిమాణాన్ని పెంచి కొత్త లైన్లు వేయించాలని ఎమ్మెల్యేని కోరారు. 

కాలనీకి ఆనుకొని ఉన్న  ఖాళీ స్థలంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాను నిలిపి వేయించి, అసాంఘిక శక్తుల నుంచి కాలనీ ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకుడు ఇనాయత్, అసోసియేషన్ నాయకులు టీఎస్ ఆనంద్ రెడ్డి, కేవీబీ మురళీమోహన్  రావు, వై రవీందర్ రెడ్డి, ఎం.రంగారెడ్డి, లింగాల శేఖర్, గఫూర్,  పి. రామేశ్వర్ రెడ్డి,  ఉమేష్ కుమార్, జియా, మసూద్ ఖురేషి, జమాత్ ఏ అహ్లే హాదీస్ అధ్యక్షుడు షఫీఖ్ ఆలం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.