పానుగల్ మండలంలో పది ఫలితాలలో  85 శాతం ఉత్తీర్ణత 

పానుగల్ మండలంలో పది ఫలితాలలో  85 శాతం ఉత్తీర్ణత 

ముద్ర,పానుగల్:- 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పానుగల్ మండలంలోని మాందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కొమ్ముల జస్వంత్ 9.5 పాయింట్లు,పానుగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలకు చెందిన నందిని 9.5 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ తెలిపారు..పానగల్ మండలంలోని మొత్తం 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు గాను మొత్తం విద్యార్థులు 357 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 305 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

మండలంలో 10 వ తరగతి ఫలితాలలో 85% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.ద్వితీయ స్థానంలో పానుగల్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థి వినయ్ 9.2 పాయింట్లు సాధించాలని మూడో స్థానంలో పానగలు ఉన్నత పాఠశాల చెందిన చైతన్య 9.0 పాయింట్లు సాధించారు. పానగల్ బాలికల ఉన్నత పాఠశాల చెందిన శివమ్మ అనే విద్యార్థిని 8.3 పాయింట్లు సాధించి నాల్గవ స్థానంలో నిలిచారని తెలిపారు.. మండలంలో టాపర్లకు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ తోపాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.