రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ మృతి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను ఢీ కొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.