స్కాంల ఫ్యామిలీకి చరమగీతం పాడాలి

స్కాంల ఫ్యామిలీకి చరమగీతం పాడాలి

ఏఐసిసి అధికార ప్రతినిధి డాలి శర్మ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మనీ, పవర్, లిక్కర్, మేనిఫెస్టో స్కాముల కెసిఆర్ ఫ్యామిలీకి చరమగీతం పాడాలని ఎఐసిసి అధికార ప్రతినిధి డాలి శర్మ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం లోని నాయకులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలన్న కెసిఆర్ పేపర్లు లికేజ్ చేస్తు నిరుద్యోగ యువత జీవితాలను బలి తీసుకుంటున్నారన్నారన్నారు.  పేపేర్ లీకేజీ వల్ల ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే మంత్రి కేటీఆర్ వక్రీకరించడం సిగ్గుచేటు అన్నారు. మహిళ అభ్యర్థి పట్ల అసభ్యకరంగా మాట్లాడిన కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో మహిళా కమిషన్, ఎలక్షన్ కమిషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. మా అభ్యర్థి ఇందిర సామాన్యమైన మహిళ కాదు స్వతంత్ర సమరయోధుని బిడ్డ ఆమె వెంట మేమందరం ఉన్నాం అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసిఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారని నాణ్యతలేని ఆ ప్రాజెక్టు రెండేళ్లకే కూలిందన్నారు. కెసిఆర్ బిడ్డ లిక్కర్ స్కామ్, కొడుకు మనీ స్కాం, సాండ్, ల్యాండ్ స్కాములో ఆ కుటుంబం ఇరుక్కుంది అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా పెద్ద స్కాం అన్నారు. 

కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తాం. అన్నారు. బీసీని ప్రధానమంత్రి చేస్తాం అన్న నరేంద్ర మోడీ బండి సంజయ్ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డికి ఎందుకు కట్టబెట్టాడు అని ప్రశ్నించారు. “కడియం కు మతిభ్రమించింది”    కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి కడియం శ్రీహరికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర కడియం పై ధ్వజమెత్తారు. అఫిడవిట్ లో రెండున్నర కోట్లు చూపించి 10 కోట్ల ఇల్లు  ఎలా కట్టాడని ఆమె ప్రశ్నించారు.  400 వందల మర్డర్ లు చేయించిన శ్రీహరి స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి అడ్డుకట్ట వేశాడన్నారు.ఎక్కడి నుంచో వచ్చిన నీకు అంత ఉంటే స్థానికంగా ఉన్న మాకెంత ఉండాలి. నీ వ్యక్తిగత విషయాలకు వెళ్తే ఉరేసుకోకుని చస్తావ్ అన్నారు. కాంగ్రెస్ కు పోత అని బెదిరించి టికెట్ తెచ్చుకున్న చరిత్ర నీది నీ దగ్గర ఉన్న 5 గురిలో 3 గురు నాకే ఓటు వేస్తారు అన్నారు. మాదిగలు, మహిళలు ఒక్కటై నిన్ను తరిమికొట్టే రోజు వచ్చిందని రేవంత్ సభ తర్వాత కడియంకి ఓటమి భయం పట్టిందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు బిపిన్, ఆనంద్ స్థానిక నాయకులు కాసాని బొందయ్య, నగరబోయిన శ్రీరాములు, జడ్పిటిసి రవి, ఎంపీటీసీ దయాకర్, రాష్ట్ర నాయకుడు అమృత రావు, చేపూరి చిరంజీవి, గుర్రం యాదగిరి ఇతరులు పాల్గొన్నారు.