ఉర్దూ జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

ఉర్దూ జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

జనగామ టౌన్, ముద్ర : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉర్దూ జర్నలిస్టులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోరారు. శనివారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, సియాసత్ సీనియర్ జర్నలిస్ట్ జమాల్ షరీఫ్ ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.

అనంతరం తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IJU) ఎన్నికలలో జనగామ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మున్సిఫ్ టీవీ జిల్లా కరెస్పాండెంట్ మహమ్మద్ ఏజాజ్ ను ముత్తిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిఫ్ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఆభిద్ ఫైసల్, ఇతమాద్ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ అజీమ్, రహేనుమా దక్కాన్ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సిరాజ్, రహీం రామిష్, రిపోర్టర్లు యూనుస్, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.