ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ....

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ....

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం. 

ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజువివరాలను అధికారులు వెల్లడించారు. 

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://resultsbie.ap.gov.in/

https://bieap.apcfss.in/

https://www.manabadi.co.in/