ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినం

ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినం

చలపతిరావుకు నివాళి
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) వ్యవస్థాపక దినం సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జెయూ) నాయకులు, సీనియర్ పాత్రికేయులు ఈరోజు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టు ఉద్యమ పితామహుడు మాణికొండ చలపతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. 1957 ఆగస్టు 17న చలపతిరావు గారి చేతుల మీదుగా జూబ్లీ హాల్ లో ఏపీయూడబ్ల్యూజే  ప్రారంభమైంది. 

చలపతిరావు స్ఫూర్తితో గత 66 సంవత్సరాలుగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ దేశంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి,  మాజీ మెజిస్ట్రేట్ కాంతయ్య, వయోధిక పాత్రికేయ సంఘం నాయకుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.