జర్నలిస్టుల జాబితాను పరిశీలిస్తాం..

జర్నలిస్టుల జాబితాను పరిశీలిస్తాం..
  • అర్హులకే నివేశన స్థలాలు..
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా..
  • కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాబితా అందజేత..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జర్నలిస్టుల జాబితాను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని, అర్హులైన వారికి మాత్రమే నివేశన స్థలాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ నాగపురి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం అక్రిడిటేషన్ లతో కూడిన అర్హులైన జర్నలిస్టుల జాబితాను కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టుల జాబితాతో పాటు మరికొన్ని వివరాలను సేకరించాల్సి ఉందని, వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

డిపిఆర్ఓ కార్యాలయంలో జర్నలిస్టుల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని, జర్నలిందరూ ఆ ఫారాలను పూరించి, పూర్తి వివరాలతో అందజేయాల్సి ఉంటుందన్నారు. సకాలంలో నివేశన స్థలాలు అందేలా చూడాలని స్థానిక సీనియర్ జర్నలిస్టులు కోరగా, స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలు తొందరగా పూరించి అందిస్తే వాటి ఆధారంగా విచారణ చేసి నివేశన స్థలాలు తొందరలోనే అందజేస్తామని హామి ఇచ్చారు. కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేసిన జాబితా పట్ల సానుకూలంగా స్పందించి, స్థలాలు అందజేస్తామని హామి ఇచ్చిన కలెక్టర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సామంతుల శ్యామ్, సామల శ్రీనివాస్, క్యాతం సతీష్, జల్ది రమేష్, బెల్లం తిరుపతి, పావుశెట్టి శ్రీనివాస్, అడ్డగట్ల శ్రీధర్, తడుక సుధాకర్, బండ మోహన్, కొంకుల సాంబయ్య, ఎడ్ల సంతోష్, వడ్లూరు సతీష్, అరెల్లి నరేందర్, మహమ్మద్ అలీ, సల్పాల తిరుపతి, బండారి రాజు, రజినీకాంత్, రాచర్ల ప్రభాకర్, పరకాల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.