దళితులకు మూడెకరాల భూమి ఇచ్చాను ఓటు అడిగే హక్కు నాకే ఉంది 

దళితులకు మూడెకరాల భూమి ఇచ్చాను ఓటు అడిగే హక్కు నాకే ఉంది 

గుండాల నవంబర్ 22 (ముద్ర న్యూస్):-ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉంది అనడానికి గంగాపురమే గ్రామమే  నిదర్శనం అని ఆలేరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతారం సుద్దాల బ్రాహ్మణ పళ్లి  రామారం నూనెగూడెం గంగాపురం మరిపడిగా సీతారామపురం గ్రామాల్లో జరిగిన ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి అడిగిందే తడువుగా కోట్లాది రూపాయలు హెచ్చించి అభివృద్ధి చేశానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి గుండాల మండలంలోని గంగాపురం గ్రామాల్లో 40 మంది కుటుంబాలకు అంది చానని అన్నారు దేవాదుల కాలువ ద్వారా సాగునీరు అందించి మండలంలో కరువు కాటకాలు లేకుండా చేశానని అన్నారు రైతులకు రైతు బీమా రైతు బంధు  బంధు కళ్యాణ లక్ష్మి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తున్నామని కరోనా కాలంలో,ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జరగబోయే ఎలక్షన్లలో కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో,మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం మండల వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు