ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారు

ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారు
  • ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్

ముద్ర ముత్తారం: మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడి చేపిస్తున్నారని ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్ అన్నారు. బుధవారం ముత్తారంలో బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మహాముత్తారం మండలంలోని మీనాజీపేటలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ జెడ్పిటిసి మందల రాజిరెడ్డి పై ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామ సర్పంచ్ మాజీ నక్సలైట్ బక్కారావు కత్తులతో దాడులకు దిగడం పిరికిపంద చర్య అని ఆరోపించారు. పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ అడివిలో నక్షలైటుగా గా ఉన్నప్పుడు ప్రజలు భయపడ్డారని, కానీ ఇప్పుడు నీకు ఎవరు భయపడరని, బక్కన్న జాగ్రత్త వ్యవహరించాలని హెచ్చరించారు. శ్రీధర్ బాబుకు ఎన్నికల సమయంలో నే గుండాలను, మాజీలను మంథనిలో దింపడం వారి గుండాయిజనికి నిదర్శనమని విమర్శించారు. మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, మాజీ సర్పంచుల మండల కన్వీనర్ చేలకల అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీర్ ఎస్ పై జరిగిన దాడులను వారు ఖండించారు.

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడి మౌనం పై భగ్గుమన్న నాయకులు

బీఆర్ఎస్ నాయకుల పై జరిగిన దాడిని ఖండిస్తూ విరుచుకో పడ్డ నాయకులు ఈ విషయంపై ఓడేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డిని మాట్లాడాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరగా ఆయన మౌనంగా ఉండటం పై బీఆర్ఎస్  నాయకులు మమ్మల్ని ఎందుకు మాట్లాడమన్నారని పార్టీ అధ్యక్షులైన మీరెందుకు మాట్లాడారని ఆయన పై మండిపడ్డారు. దాడికి పాల్పడిన మాజీ నక్సలైట్ మా గ్రామం నేను ఎలా మాట్లాడుతనాని ఉండమంటే ఉంటా లేకుంటే వెళ్ళమంటే వెళ్తానని అనడంతో మాకైతే దగ్గర కాదుఅ బక్కన్న అని మండల అధ్యక్షుడుని కార్యకర్తలు అడగడం చర్చనీయమైంది. ముత్తారంకు చెందిన మరో నాయకుడేమో తప్పించుకొని రాలేదని చర్చ పెట్టారు. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం మేరకు కొందరు మాట్లాడారు ,మరికొందరు మాట్లాడకపోవడంపై ఆ పార్టీ నాయకులలోనే భగ్గుమన్న విభేదాల పై చర్చా వేదికకు దారితీసాయి. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ పోరం అధ్యక్షుడు నూనె కుమార్, మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు అల్లం తిరుపతి, నాయకులు ఉప్పు శ్రీను, చల్ల సమ్మయ్య, ఇల్లందుల అశోక్, శేరు స్వామి, గాదం శ్రీనివాస్, పప్పు చంద్రమౌళి, రామగల్ల మధుకర్, ఐత రాజు, రావుల రాజ్ కుమార్, కూరాకుల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.