కెసిఆర్ ను కాపాడేందుకు బీజేపీ సీబీఐ విచారణ చేపట్టాలంటోంది

కెసిఆర్ ను కాపాడేందుకు బీజేపీ సీబీఐ విచారణ చేపట్టాలంటోంది

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై పారదర్శకంగా వాస్తవాలను వెలికితీసేందుకే న్యాయవిచారణ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై అన్ని ఆధారాలున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు... కవిత అంశంలో ఎందుకు నాన్చుతున్నారు.. కవితపై ఉన్నపై విచారణ తొక్కిపెట్టినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ తొక్కిపెట్టేందుకు, కేసీఆర్ను కాపాడేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. రాయికల్ పట్టణంలోని 4వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శింఛి దరఖాస్తుల స్వీకరణను వరిశీలించి అర్హులైన నిరుపేదలందరూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించి బ్యారేజీ కుంగిపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీడబ్ల్యూసీ అనుమతులు లేవని బీఆర్ఎస్ వాళ్లే చెప్పారని అన్నారు.

ప్రాజెక్టు అనుమతులు వరిశీలించి, నిధులు ఇవ్వాల్సి ఉండగా, వూర్తిస్థాయిలో అనుమతులు లేని ప్రాజెక్టుకు నిధులు ఏవిధంగా నమకూర్చారు.. ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని నాలుగేళ్లుగా బీజేపీ నాయకులు చెబుతున్నారు.. నాలుగేళ్లుగా ఎప్పుడు చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ పారదర్శకతతో వాస్తవాలను వెలికితీయాలనే భావనతో, న్యాయ విచారణకు ఆదేశిస్తున్న తరుణంలో బిజెపి నాయకులు కాళేశ్వరం పై సీబీఐ విచారణ ఎందుకు చేపట్టడం లేదనడం ఆశ్యర్చం కలుగుతుందన్నారు. రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండ పారదర్శకత విచారణ చేపట్టేది న్యాయ విచారణ.. న్యాయ విచారణ చేవడుతామంటే బీజేపీ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.

లిక్కర్ స్కాం విచారణను ప్రజలు గమనించారని, సిసోడియా నుండి మొదలుకొని అరవింద్ కేజ్రివాల్ను విచారణ చేవడుతున్నారు. టీఆర్ఎస్ కొమ్ము కాసేందుకు బీజేపీ ఏవిధంగా వ్రయత్నం చేస్తుందో న్యాయ కోవిదులు, మేధావులు, తెలంగాణ సమాజం ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణలో సాంకేతికంగా సలహా, సూచలను పొందటానికి, విచారణలో తోడ్పడటానికి ఏ ఏజన్సీనైనా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సీబీఐ నుండి కూడా సలహాలు, సూచనలు పొందవచ్చనే విషయం బీజేపీ తెలుసుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పాలనలో చేవట్టిన ప్రాజెక్టుల అన్ని ఇంజినీరింగ్ ప్రొక్యూరింగ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో చేపట్టారు. ఈవీసీ విధానంలో ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు ఏజన్సీ వూర్తి బాధ్యత వహిస్తుంది. ఈవీసీ విధానాన్ని వక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించిన ప్రభుత్వమే నిర్మాణ లోపాలకు బాధ్యత వహించాలని అన్నారు.