బీఆర్‌ఎస్‌ జోష్ 

బీఆర్‌ఎస్‌ జోష్ 
  • పార్టీలో పెరుగుతున్న చేరికలు
  • కేడర్‌లో నూతనోత్సాహం
  • మంత్రి జగదీష్ రెడ్డి  సమక్షంలో 82  మంది చేరిక
  • మంత్రి కి మద్దతుగా ఏకమవుతున్న గ్రామాలు 
  • పెన్ పహాడ్ మండలం అనాజీపురం లలో  కాంగ్రెస్‌, బిజెపి నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి

పెన్ పహాడ్:- తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు , సూర్యాపేట నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి ని చూసి కాంగ్రెస్‌, బీజేపీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి రోజు రోజు కు వలసలు పెరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల సమీపిస్తున్న వేళ చేరికలు   బీఆర్‌ఎస్‌ లో  జోష్ ను నింపుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న చేరికలతో కేడర్‌లో నూతనోత్సాహం తోనికిసలాడుతుంది. తాజాగా పెన్ పహాడ్ మండలం అనాజీపురం కు చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలను వదిలేసి  మంత్రి జగదీష్ రెడ్డి  సమక్షంలో 82  మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పిన మంత్రి పార్టీ లో చేరిన  వెంకన్న, షేక్ రంజాన్, దేవయ్య, పర్వతం సతీష్, అక్కినేపల్లి మధు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, పగడాల బిక్షం, ఆలగడప జానీ లతో పాటు ఇతర నేతలకు కార్యకర్తలకు సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపారన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మితే నట్టేట ముంచుతారని, రాబోయే రోజుల్లో పార్టీలకతీతంగా ప్రజలు ఏకమై బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. అభివృద్ధికి మద్దతుగా వాటిల్లో చేరిన వారందరినీ మంత్రి అభినందించారు. అనాధపురం సర్పంచ్ చిన్న శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చేరికలు జరిగాయి.