జాబ్ మేళాలతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు

జాబ్ మేళాలతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు
  • అటవీ శాఖ మంత్రి ఐ కే రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:వివిధ కంపెనీలు విద్యాసంస్థల్లో నిర్వహించే జాబ్ మేళాలు ఎంతో ఉపయోగకరమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాలో కంపెనీ ప్రతినిధులే కళాశాల ముంగిట్లోకి వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మధ్యతరగతి ఉద్యోగార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా అవకాశాలు కలుగుతాయని అన్నారు. అమెజాన్ వంటి కార్పొరేట్ సంస్థలు సైతం ఇలాంటి జాబ్ మేళాలో కి వచ్చి నియామకాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, నాయకులు రామ్ కిషన్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భీమారావు తదితరులు పాల్గొన్నారు.