భువనగిరి పార్లమెంట్ పై సమీక్షకు బీబీనగర్ బీఆర్ఎస్ నాయకులు

భువనగిరి పార్లమెంట్ పై సమీక్షకు బీబీనగర్ బీఆర్ఎస్ నాయకులు

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: రానున్న పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని బీబీనగర్ మండల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశానికి బీబీనగర్ మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు సారథ్యంలో పార్టీ నేతలు పలువురు తరలివెళ్లారు.

భువనగిరి పార్లమెంటుపై పార్టీ రాష్ట్ర నాయకులు సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నాయకత్వంలో బీబీనగర్ మండలంలోని అందరు పార్టీ నాయకులు హాజరయ్యారు.  మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, పార్టీ నాయకులు గోలి పింగళ్ రెడ్డి, రహీంఖాన్ గూడ సర్పంచి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.