తెలంగాణ కమ్మ సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు రవి శంకర్....

తెలంగాణ కమ్మ సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు రవి శంకర్....

ఈ రోజు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో 43 కమ్మ సంఘాల నుంచి మెజారిటీ నాయకుల ఓట్లతో ఎన్నుకోబడిన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బొడ్డు రవిశంకర్ గారు. 

ఎస్వీ కృష్ణ ప్రసాద్ గారు మరియు బండి రమేష్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు ఇరువురిని సన్మానం చేస్తూ మంత్రివర్యుల ఆశీస్సులతో ఈ సంఘం అధ్యక్షుడుగా ముందుకెళ్లాలని నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ గారిని సంఘంలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తేవాలని వారు అందరిని కలుపుకెవెళ్లాలని సూచిస్తూ అన్ని సంఘాల సభ్యులకు తెలియజేయడమైనది వారు ఎల్లవేళలా ప్రజలకు కమ్మ కులస్తులకు అందుబాటులో ఉంటూ వారిని ఎల్లవేళలా చూసుకుంటూ అన్ని సంఘాలతోటి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము మిగతా కమిటీ సభ్యులు అందరు సహకరించి ఈ కమ్మ సంఘాల సమైక్యని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతని రవిశంకర్ గారు మోస్తూ అలాగే ఈ సమ్మేళనానికి వచ్చిన బండి రమేష్ గారికి వనస్థలిపురం అధ్యక్షులు మరియు ఇతర సంఘాల అధ్యక్షులు అందరికి కూడా ధన్యవాదాలు అలాగే తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ సంఘాలకు ఇచ్చిన ల్యాండ్ కి మనకి ఇమ్మీడియట్ గా పర్మిషన్లు ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి వారు ఆశీస్సులు కోరుతూ అలాగే మన సంఘాలకు ఎల్లప్పుడూ వారి ఆశీస్సులు ఉంటాయని గారితో సమావేశం ఆశిస్తూ అతి త్వరలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు తీసుకుని కమ్మ సంఘాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. 

ఇట్టి సమావేశంలో వనస్థలిపురం కమ్మ సంఘం అధ్యక్షుడు గంగాధర్ రావు గారు, వెలగ చంద్రశేఖర రావు గారు, బొడ్డు వెంకటేశ్వరరావు గారు, మాజీ కార్పొరేటర్ రంగారావు గారు, గజ్వేల్ కమ్మ సంఘం అధ్యక్షులు గారు, కొత్తగూడెం కొమ్మ సంఘం అధ్యక్షులు గారు, నాగేశ్వర రావు గారు ఇంకా చాలామంది కమ్మ సంఘం నాయకులు పాల్గొనడం జరిగినది.