సరిహద్దు రోడ్లపై నిఘా అవసరం

సరిహద్దు రోడ్లపై నిఘా అవసరం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్ర సరిహద్దు రహదారుల పై నిఘా అవసరమని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ డిజిపి  అంజని కుమార్ మంగళవారం నాడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ  కె. చంద్రమోహన్, ఎక్సైజ్ సూపర్డెంట్ రవీందర్ రాజు పాల్గొన్నారు. 

రానున్న యాసంగి పంట దృష్ట్యా కర్ణాటక, మహారాష్ట్రల నుండి మన రాష్ట్రంలోనికి వరి ధాన్యం రాకుండా నివారించుటకు చెక్ పోస్ట్ లు ఏర్పాటు అదేవిధంగా గంజాయి రవాణా, అక్రమ మద్యం, గుడుంబా వంటి వాటిని రాష్ట్రంలోనికి రానివ్వకుండా తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగముగా ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, మోటారు వాహన, ఎక్సైజ్ శాఖల అధ్వర్యంలో మద్నూర్ మండల ప్రాంతం సలబత్ పూర్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.