సీఏఏ ఎన్ఆర్సి ని రద్దు చేయాలి 

సీఏఏ ఎన్ఆర్సి ని రద్దు చేయాలి 
  • సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్

ముద్ర,పానుగల్:- కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA NRC ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ అన్నారు.పానగల్ మండల కేంద్రంలోని శుక్రవారం సిపిఎం పార్టీ పాన్గల్ మండల నాయకులు ఎం వెంకటయ్య అధ్యక్షతన సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఉద్దేశంతో ఎటువంటి చర్చ లేకుండా ఆగమేఘాల మీద తీసుకొచ్చిన CAA ఎన్ఆర్సి ని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నాదని అన్నారు. దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల మీద బీజేపీ కి ఉన్న వ్యతిరేకతలో CAA ఎన్ ఆర్ సి ద్వారా అనగదొక్కాలని కుట్ర కు బిజెపి తెరలేపిందని దీంతో దేశంలో విద్వేశాలను రెచ్చగొట్టే సాంప్రదాయానికి బిజెపి శ్రీకారం చుట్టిందని అన్నారు.ఢిల్లీ సరిహద్దులో రైతులు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బ్రిటిష్ కాలం కంటే క్రూరమైనటువంటి నిర్బంధాలను రైతులపై ప్రయోగిస్తున్నారని విమర్శించారు. రైతులపై డ్రోన్ కెమెరా ల ద్వారా బాష్ప వాయువులను ప్రయోగిస్తూ రైతులను దేశద్రోహులుగా చూపించే కుట్ర జరుగుతున్నదని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను మెచ్చుకున్న బిజెపి స్వామినాథన్ కు ఆయన ఇచ్చిన సలహాలను మాత్రం పాటించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఎలక్ట్రోరల్ బాండ్లను బిజెపి సేకరించి ఆ యొక్క దాటాను సుప్రీంకోర్టుకు అందజేయడంలో విఫలమైన ఎస్బిఐ చైర్మన్ ను వెంటనే తొలగించాలని ఎలక్ట్రోలల్ బాండ్లపై సిబిఐ విచారణ సుప్రీంకోర్టు సూచించిన విధంగా అట్టి బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. దేశంలో అధికారంలోకొస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న బిజెపి హామీ నీటి మూటగానే మారిందని ఎద్దేవ చేశారు.విదేశీ బ్యాంకులో ములుగుతున్న నల్లధనాన్ని వెలికితీసి దేశ ప్రజల ప్రతి అకౌంటులో 15 లక్షల రూపాయలు నగదు జమ చేస్తామన్న బిజెపి ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి మహిళా అకౌంట్లో వేస్తానన్న 2500 నగదును వెంటనే జమ చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ  ఎన్నికల కోడ్ పేరుతో 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలుకు ఆటంకంగా మారిందని ఇ నేపథ్యంలో ప్రజలందరికీ జీరో బిల్లులు ఇచ్చే విధంగా ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి లేఖ రాసి పక్క అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు. వేణుగోపాల్, జంబులయ్య, భీమయ్య,జి వెంకటయ్య, కాజా,సూర్యవంశం రాము, ఎన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు