కులవృత్తిదారులకు రూ.400 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్​

కులవృత్తిదారులకు రూ.400 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : కులవృత్తులు చేసి జీవించే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.400 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో కుల వృత్తులు చేసేవాళ్లకు ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. కులవృత్తులు, చేతివృత్తి పనులు చేసుకునే బీసీ కుటుంబాలకు ఈ సాయం అందిస్తారు. ఈ క్రమంలో రూ.400 కోట్ల నిధులను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. అర్హులైన కులవృత్తులు, చేతివృత్తి పనులు చేసుకుంటున్న వారికి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు.  గ్రామాలవారీగా అందిన దరఖాస్తులను గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.