కుమారి ఆంటీకి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ...

కుమారి ఆంటీకి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ...

ముద్ర,హైదరాబాద్:- చిరు వ్యాపారి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.కుమారి ఆంటీ నిర్వహిస్తున్న ఫుడ్ పాయింట్ వల్ల ట్రాఫీక్ జామ్ అవుతోందని పోలీసులు స్టాల్ ను అక్కడి నుంచి తొలగించాలని ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమెకు మద్ధతు తెలిపేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆమెకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కుమారి ఆంటీకి మద్ధతు తెలిపారు నెటిజన్స్.సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులరైన కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ పాయింట్ వల్ల ట్రాఫీక్ జామ్ అవుతోందని పోలీసులు స్టాల్ ను అక్కడి నుంచి తొలగించాలని కుమారి ఆంటీపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆమెకు మద్ధతు తెలిపేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆమెకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కుమారి ఆంటీకి మద్ధతు తెలిపారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ పాయింట్ కు మళ్లీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 

సోషల్ మీడియాలో అత్యంత తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించిన కుమారి ఆంటీ తన ఫుడ్ పాయింట్ లో రుచికరమైన ఫుడ్ ను అందిస్తూ ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు యూట్యూట్ ఛానళ్లు ఈమె ఇంటర్వ్యూ తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సెలబ్రిటీలు సైతం కుమారీ ఆంటీ ఫుడ్ పాయింట్ ను సందర్శించడానికి ఆసక్తి చూపారు. దీంతో ఆ ఏరియాలో జనసందోహం పెరిగిపోయింది. 

అంతేకాదు, సోషల్ మీడియాలో కుమారి ఆంటీ క్రేజ్ మరింత పెరగడంతో కస్టమర్ల తాకిడి కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఆమె నిర్వహిస్తోన్న ఫుడ్ పాయింట్ కేబుల్ బ్రిడ్జీ పరిసర ప్రాంతానికి అతి దగ్గర్లో ఉంది.  ఆ దారిగుండా ట్రాఫిక్ జామ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. 

నా విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి సీఎం స్పందించడం గొప్ప విషయం. సీఎం మా హోటల్‌కి వచ్చి ఫుడ్ రుచి చూస్తా అనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మా హోటల్‌ని యధా స్థితిలో కొనసాగించేలా అధికారులను ఆదేశించిన సీఎంకి కృతజ్ఞతలు.