సోషల్‌ మీడియాలో ట్రోలర్స్‌పై కేసులు నమోదు

సోషల్‌ మీడియాలో ట్రోలర్స్‌పై కేసులు నమోదు

మహిళల పట్ల అసభ్యంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.  ప్రజాప్రతినిధులపై సోషల్‌ మీడియాలో అసత్య ట్రోల్స్‌ చేసిన 20మందిపై కేసులు నమోదు చేశామని, 8మందికి 41ఏ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

సబ్‌స్క్రైబర్లు, వీక్షణల కోసం మార్ఫింగ్‌ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను కించపర్చే విధంగా ట్రోలింగ్‌ జరిగిందని గుర్తించామన్నారు. కొంత మంది యువత సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్‌ చేసిన వీడియోలను, అవమానకరమైన కంటెంట్‌ను ట్రోలింగ్‌ చేస్తున్నారని డీసీపీ వివరించారు. అసత్య ట్రోల్స్‌ చేసే ఛానెళ్లు, నిర్వాహకుల వివరాలను వెల్లడించారు.