సిపిఎం అభ్యర్థ జహంగీర్ గెలుపు సమగ్రాభివృద్ధికి మలుపు : పాలడుగు భాస్కర్

సిపిఎం అభ్యర్థ జహంగీర్ గెలుపు సమగ్రాభివృద్ధికి మలుపు : పాలడుగు భాస్కర్

ముద్ర ప్రతినిధి భువనగిరి : మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద కార్పోరేట్ బిజెపిని ఓడించాలని శ్రామిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సుందరయ్య భవన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో పదేళ్ల పాలన కొనసాగించిన బిజెపికి ముగింపు పలకాలని కోరారు.

అధిక ధరలు నిరుద్యోగము ఆర్థిక సంక్షోభం వల్ల పేద, మద్యతరగతి ప్రజలు తీవ్ర కష్టాల పాలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఎలక్ట్రోల్ బాండ్స్, పెద్ద నోట్ల రద్దు రపెల్ యుద్ధ విమానాలకు కొనుగోలులో బిజెపి అవినీతి చర్యలకు పాల్పడిందని అన్నారు. వ్యవసాయ సంక్షోభం వల్ల రైతాంగం చితికిపోయిందని అన్నారు. లక్షలాది మంది రైతులు మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా పని గంటలు పెంచి భారాలు మోపిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్, జగదీష్, కొండమడుగు నర్సింహ, రాష్ట్ర నాయకురాలు ఆశలత, వంగూరి రాములు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ , బీబీనగర్ పార్టీ మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, నాయకులు లావుడియా రాజు, పల్లెర్ల అంజయ్య, మంచాల మధు పాల్గొన్నారు.