మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి.

మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి.
  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు.

మోత్కూర్(ముద్ర న్యూస్):కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మోత్కూరులో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో జరిగిన మోత్కూర్,గుండాల,ఆత్మకూర్(యం),అడ్డగూడూర్ మండలాల ప్రాంతీయ రాజకీయ శిక్షణ తరగతులకు అయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో సమాధానం చేయాలని డిమాండ్ చేశారు.ఆర్ఎస్ఎస్ భావజాలంతో వున్న బిజెపి దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించి కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ అవసరాల కోసం తప్ప దేశ ప్రజలను కాపాడే దిశగా పని చేయడంలేదని విమర్శించారు.దేశ వ్యాప్తంగా కుల గణన జరుగకుండా, కులాలకుసీట్లుకేటాయించకుండా మహిళ రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా ప్రచార ఆర్భాటం కోసం బిల్లుకు ఆమోదించారు తప్ప అమలు చేయడంలో ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,గుండాల సీపీఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు,అత్మకూర్ మండల కార్యదర్శి వేముల బిక్షం,అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్, రాచకొండ రాములమ్మ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.